

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా తాజా పోస్టర్ భారీ చర్చకు దారితీసింది. వివేక్ ఒబెరాయ్ పక్కన బ్లాక్ గాగుల్స్‌తో సీరియస్ లుక్‌లో కనిపించిన నటి ఐశ్వర్య దేశాయ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఎవరు అనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. ఇండో-అమెరికన్ మోడల్‌గా గుర్తింపు పొందిన ఐశ్వర్య అంతర్జాతీయ ఫ్యాషన్ షోలు, ప్రముఖ బ్రాండ్ ప్రకటనల ద్వారా పేరు సంపాదించారు.
‘స్పిరిట్’ ఆమె తొలి సినిమా కాదు. గతంలో ‘గల్లీ బాయ్స్’, ‘ర్యాట్ ఇన్ ది కిచెన్’ చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగిటివ్ పాత్రతో అనుబంధం ఉన్న పవర్ఫుల్ రోల్లో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్, వంగా వంటి సెన్సేషనల్ దర్శకుడి ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆమె కెరీర్‌కు కీలక మైలురాయిగా మారనుంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!