

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాను మార్చిలో విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడుతుందేమో అన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం షూట్ లేటు అవుతోంది అనే కారణాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు ప్యారడైజ్ విషయంలో ఏం జరుగుతోంది.
ఇప్పటివరకు సుమారు 60 రోజుల షూటింగ్ పూర్తైంది. ఈ సమయంలో కీలకమైన, కష్టమైన సన్నివేశాలు, ముఖ్యంగా భారీ యాక్షన్ ఫైట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇంకా మరో 60 రోజులు షూటింగ్ మిగిలి ఉంది, అందులో టాకీ పార్ట్ మరియు పాటల చిత్రీకరణ మాత్రమే ఉంటుంది. అందువల్ల పెద్దగా ఆలస్యం అయ్యే అవకాశం లేదని చిత్ర బృందం చెబుతోంది.
అయితే, షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్కు కనీసం మరో నెల అవసరం కావడంతో మార్చిలో విడుదల కష్టం అని తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ, సినిమాను ఈ సమ్మర్లోనే (మార్చి నుంచి జూన్ మధ్యలో) మంచి తేదీ చూసి విడుదల చేస్తామని తెలిపారు. నాని చివరి సినిమా ‘హిట్ 3’ థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్న నేపథ్యంలో, ‘ప్యారడైజ్’పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!