
గాసిప్స్

పార్కింగ్ (2023) సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు రామకుమార్ బాలకృష్ణన్, హీరో సూర్యతో కలిసి సినిమా చేయనున్నారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, రామకుమార్ ఇటీవల సూర్యకు ఒక కథ లైన్ వినిపించగా, ఆ కాన్సెప్ట్ సూర్యకు బాగా నచ్చిందట. ఇటీవలి కాలంలో సూర్య కొత్త తరహా కథలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం కథపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పార్కింగ్ తరహాలోనే, సాధారణమైన ఒక అంశాన్ని తీసుకుని ఉత్కంఠభరితంగా సాగే కథగా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇది డొమెస్టిక్ థ్రిల్లర్ లేదా బ్లాక్ కామెడీగా రూపొందవచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సూర్య – రామకుమార్ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి ఏర్పడింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!