

నటి, నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల తన గతంలో చేసిన డేటింగ్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించింది. ఒకప్పుడు తాను నటుడితో ఎప్పటికీ డేటింగ్ చేయనని చెప్పిన మాటల వెనుక అప్పటి తన ఆలోచనలు, పరిసర పరిస్థితులు ఉన్నాయని వివరించింది. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనా విధానంలో మార్పులు రావడం సహజమని పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకోవడంలో తప్పేమీ లేదని తెలిపింది.
జీవితంలో ఎలాంటి మార్పునైనా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శోభితా వెల్లడించింది. ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించేవారు పరిస్థితులకు భయపడుతున్నట్లుగా తనకు అనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ప్రేమ గురించి మాట్లాడుతూ.. అది కేవలం ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మాత్రమే కాదని, రెండు మనసుల కలయిక అని పేర్కొంది. ప్రేమను కేవలం రొమాన్స్‌కే పరిమితం చేయలేమని అభిప్రాయపడింది. కాగా, శోభితా ధూళిపాళ్ల, నాగచైతన్య 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!