

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాక్షన్ హీరోగా, యాంగ్రి యంగ్‌మ్యాన్‌గా పెద్ద మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడు డాక్టర్ రాజశేఖర్. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించేవి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ, రొమాంటిక్ కథలతో కూడా ప్రేక్షకులను అలరించారు. అయితే వరుస ఫ్లాపులు, ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. గరుడ వేగ, కల్కి సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించినా తర్వాత మళ్లీ కొంత వెనుకబడ్డారు.
ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైకర్ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వీ.వంశీ కృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తున్నారు. అలాగే అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని గిబ్రాన్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 3 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథలో శర్వానంద్‌కు కోచ్‌గా రాజశేఖర్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో ఆయన లుక్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ మంచి కథ ఉంటే హీరోగా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించడానికి ఆయనకు దాదాపు రూ.3 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.









.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!