

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' మహేష్ బాబు పి. దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చి, హిట్ టాక్‌తో రికార్డులు మీరుతూ దూసుకుపోతుంది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్ టైమ్ నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే రామ్ ఇప్పటికే “పాట రాసినప్పుడు హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు రూమర్స్ అన్నీ ఫేక్” అని క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆ గాసిప్ ఆగలేదు.
ఇప్పుడు భాగ్యశ్రీ షేర్ చేసిన అమెరికా ట్రిప్ ఫోటోలు, వీడియోలు అయితే మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ కోసం యూఎస్‌లో ఉన్న రామ్–భాగ్యశ్రీలు డల్లాస్, షార్లెట్, వర్జీనియా వంటి చోట్ల ప్రీమియర్ షోలకు హాజరయ్యారు. ఒకే కారులో ట్రావెల్ అవుతూ, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న వీడియోలు చూసి నెటిజన్లు “ఇంకెన్నాళ్లు దాచుతారు?”, “పెళ్లి కార్డు పంపించండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. డల్లాస్ ప్రీమియర్‌లో భాగ్యశ్రీ షేర్ చేసిన రామ్‌తో కలిసి ఉన్న ఫోటోలు మరింత ఊపందుకునేలా చేశాయి. ఇటీవల ప్రోమో ఈవెంట్లో భాగ్యశ్రీ “రామ్ హార్ట్స్ ఆఫ్ కింగ్” అని ప్రశంసిస్తూ మాట్లాడటంతో కూడా రూమర్స్ ఇంకా ఊరటించాయి. ప్రేమ నిజమో కాదో స్పష్టత లేకపోయినా, ఈ వీడియోలు, ఫోటోలు మాత్రం వారి పేర్ల చుట్టూ గాసిప్ మంటలు మళ్లీ రగిలించాయి!











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!