

దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె పెళ్లి జరగబోతోందంటూ పలు రూమర్లు వైరల్ అయ్యాయి. వచ్చే నెలలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ తాజాగా బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు అందరి దృష్టిని మరోవైపు మళ్లించాయి.
ఇప్పుడు మృణాల్ పేరు మరో యంగ్ హీరోతో లింక్ అవుతోంది. అతను మరెవరో కాదు, బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ఇటీవల వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లలో కనిపించడంతో, డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన ‘దో దీవానే సేహర్ మేన్’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఈ గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో వారి మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యం కూడా అభిమానుల ఆసక్తిని పెంచుతోంది.
ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది సిద్ధాంత్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్. సినిమా టైటిల్ సాంగ్‌తో కలిసి ఆయన షేర్ చేసిన రీల్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డేటింగ్ రూమర్లపై మృణాల్ గానీ, సిద్ధాంత్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది నిజమైన ప్రేమకథా? లేక సినిమా ప్రమోషన్లో భాగమా? అన్నది కాలమే చెప్పాలి. ప్రస్తుతం మాత్రం మృణాల్–సిద్ధాంత్ జంట బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!