

హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా కాలంగా ప్రొడక్షన్ దశలో ఉంది. మొదట ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, భారీ బడ్జెట్, పీరియాడ్ యాక్షన్ డ్రామా కావడం, ఎక్కువగా సీజీ పనులు ఉండటంతో సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
ఇప్పుడైతే ఈ సినిమాపై స్పష్టత వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్లో ‘స్వయంభు’ విడుదలకు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అవుతున్న దశలో ఉండగా, అన్ని అగ్రిమెంట్లు పూర్తయితే రిలీజ్ డేట్పై పూర్తిస్థాయి క్లారిటీ రానుంది.
సుమారు 70 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నుంచి నాన్ థియేట్రికల్ ద్వారా దాదాపు 50 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థకు అనుకూలమైన తేదీలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో పెద్ద సినిమాలు తక్కువగా ఉండటంతో, ఏప్రిల్లో ‘స్వయంభు’కు మంచి రిలీజ్ డేట్ దొరికే అవకాశముంది. ఓటీటీ డీల్ పూర్తయ్యాక పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!