

నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’లో నటిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ లేదా పోస్ట్ సమ్మర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, మరో రెండు మూడు నెలల్లో నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అవుతారు. ఆ తర్వాత ఆయన చేయబోయే తదుపరి సినిమా ఏదన్నదానిపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.
ఇటీవల నాగ చైతన్య ఎక్కువగా లవ్ స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, మిస్టిక్ థ్రిల్లర్లపై ఫోకస్ చేశారు. చాలా కాలం తర్వాత ఈసారి ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలని ఆయన డిసైడ్ అయినట్లు టాక్. ఈ మాస్ సినిమాకు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగ చైతన్య – హరీష్ శంకర్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌నగర్‌లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా చేసిన తరువాత మళ్లీ ఓ రేంజ్ యంగ్ హీరోతో హరీష్ శంకర్ చేసే సినిమా ఇదే కావొచ్చు. అలాగే నాగ చైతన్య కూడా ఇటీవల కాలంలో ఒక పక్కా మాస్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఇదే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!