

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవలి కాలంలో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వైరల్ అవుతోంది. ఓ యువ మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఓ యువ హీరోయిన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు ప్రముఖ సినీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ప్రసిద్ధ సంగీత దర్శకుడు కాగా, కుటుంబంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు కూడా ఉన్నారు. తన సంగీతంతో ఇటీవల వచ్చిన మధ్యస్థాయి సినిమాలను కూడా విజయవంతం చేయడంలో ఈ యువ సంగీత దర్శకుడు మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ఇటీవల ఆమె తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారిందని సమాచారం. ఇటీవల ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం వంటి వార్తలు మీడియాలో చర్చకు దారి తీసాయి.
కొంతకాలంగా వారి ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా, రెండు కుటుంబాలు కూడా సానుకూలంగా స్పందించాయని ప్రచారం జరుగుతోంది. అందువల్ల త్వరలోనే పెళ్లికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ వార్తకు నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ అని, యువ హీరోయిన్ చాందీని చౌదరీ అంటూ మ్యారేజ్ అనే వార్తకు సంబంధించిన పోస్టుల కింద కామెంట్ చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఈ బంధం కొనసాగుతుందా? ఈ పెళ్లి వార్తలో నిజం ఎంత? తమ రిలేషన్షిప్ గురించి వస్తున్న ఈ వార్తపై వారు స్పందిస్తారా? తమ పెళ్లి వార్తను అధికారికంగా ధృవీకరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!