

ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. ఒకప్పుడు శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలిచినట్లే, ఆ తరువాత అదే స్థాయిలో వెంకటేష్ కుటుంబ కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యం కలిసిన పాత్రలు వెంకటేష్‌కే బాగా సరిపోతాయని ప్రేక్షకులు నమ్మే స్థాయికి ఆయన చేరుకున్నారు. అందుకే ఆయన సినిమాల్లో భావోద్వేగంతో పాటు మంచి కామెడీ కూడా కనిపిస్తుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు వెంకటేష్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా రాబోతోంది. ఇది త్రివిక్రమ్ తొలిసారి వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం విశేషం. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది, ఈ ఏడాదే విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు.
ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాల నుంచి తీసుకున్నారనే విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోని క్లైమాక్స్ బాలీవుడ్ చిత్రం ‘గోల్ మాల్’ నుంచి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగానే త్రివిక్రమ్ కాపీ చేశాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!