

‘బింబిసార’ తర్వాత మరో హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నారు. మంచి కథ దొరికితేనే సినిమా చేయాలి, లేకపోతే వద్దు అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రెండు నుంచి మూడు కథలు చర్చల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి రచయిత శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ. ఇప్పటివరకు చాలా సినిమాలకు కథలు, మాటలు అందించిన ఆయన, ఈసారి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ కథపై కళ్యాణ్ రామ్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరో కొత్త దర్శకుడు చెప్పిన కథ కూడా పరిశీలనలో ఉంది. ఈ రెండు కథల్లో ఏది ఓకే అవుతుందో, లేక రెండూ స్టార్ట్ అవుతాయో అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఒక సినిమా గతంలో కలిసి పనిచేసిన ముప్పా అశోక్ తో చేసే అవకాశం ఉండగా, మరో సినిమా స్వంత బ్యానర్లో ఉండవచ్చని టాక్.
ఇదే కాకుండా, ప్రస్తుతం దేవర 2 సినిమాను కూడా స్వంత బ్యానర్ భాగస్వామ్యంలో నిర్మించాల్సి ఉంది. మొత్తానికి కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవ్స్ పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!