
రాజకీయాలు

జెన్సెన్ హువాంగ్ ఇటీవల తైవాన్ వీధుల్లో సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియా కు సీఈఓగా, ఏఐ విప్లవానికి ప్రధాన శక్తిగా నిలిచిన ఆయన ప్లాస్టిక్ బ్యాగులు స్వయంగా మోస్తూ ఎలాంటి ఆడంబరాలు లేకుండా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ భద్రతా ఏర్పాట్లు, లగ్జరీ కార్లు లేకుండా ఎంతో సాధారణంగా కనిపించారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక టెక్ నాయకుల్లో ఒకరైనప్పటికీ జెన్సెన్ హువాంగ్ ఎంతో సింపుల్గా ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంది. నిజమైన శక్తి, ప్రభావం ఆడంబరాల్లో కాకుండా వ్యక్తిత్వంలో ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన వినయానికి, సరళ జీవనశైలికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!