

తన టాలీవుడ్ ఫ్లాప్ ఫేజ్ గురించి ఇటీవల బహిరంగంగా మాట్లాడిన రకుల్ ప్రీత్ సింగ్, దే దే ప్యార్ దే 2 ప్రమోషన్స్‌లో పాత సినిమాలను ప్రస్తావించగానే ట్రోల్స్ మళ్లీ యాక్టివ్ అయ్యాయి. కానీ రకుల్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలోనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఆమె తాజా ఫోటోలు అదే చెబుతున్నాయి బ్రౌన్ సూట్, నప్పేలా ఫిట్, అందంగా అమర్చిన గోల్డ్ జువెలరీ అన్నీ కలిపి ఆమెను మరింత కాన్ఫిడెంట్‌గా చూపిస్తున్నాయి. పోజుల్లో కనిపిస్తున్న నిశ్శబ్ద ధీమా ఆమె లుక్‌పై ఎంత నమ్మకంగా ఉందో చెబుతోంది. చాలా కాలం తర్వాత హిట్ రావడంతో, ఇప్పుడు ఆమె ఏ సినిమాను ఎంచుకుంటుందన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల ఆమె చేసిన గ్లామరస్ ఛాయిసెస్ చూస్తుంటే ఇదే స్టైల్ కొనసాగుతుందా, లేక కొత్త దారిలో నడుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తానికి, రకుల్ చుట్టూ ఉన్న బజ్ మళ్లీ జోరందుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!