బుధవారం ఒక్కసారిగా ఉవ్వెత్తున పెరిగిన బంగారం ధరలు, ఇవాళ (జనవరి 22, 2026) తగ్గుముఖం పట్టాయి. యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నిన్న బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో, ఇవాళ పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి.
నిన్న ఒక్క రోజులోనే 100 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకుపైగా పెరగడం గమనార్హం. గురువారం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.229 తగ్గి రూ.15,431 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.210 తగ్గి రూ.14,145కి చేరగా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.172 తగ్గి రూ.11,573 వద్ద ఉంది.
100 గ్రాముల ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల బంగారం రూ.22,900 తగ్గి రూ.15,43,100గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.21,000 తగ్గి రూ.14,14,500 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.17,200 తగ్గి రూ.11,57,300గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి.
హైదరాబాద్:
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450
10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730
చెన్నై:
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,910
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,000
10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,18,500
ఢిల్లీ:
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,460
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,600
10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,15,880
విశాఖపట్నం:
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450
10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730
బెంగళూరు:
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450
10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.
.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!