

ప్రపంచంలోని ప్రముఖ సీడీఎంఓ (కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) సంస్థ లోంజా గ్రూప్ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తెలంగాణను అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మరింత బలోపేతం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోంజా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న కొత్త కేంద్రం సంస్థ గ్లోబల్ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
ఇక ‘లో పవర్ వైర్లెస్’ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న అమెరికాకు చెందిన సిలికాన్ ల్యాబ్స్ కూడా హైదరాబాద్‌లోని తమ కార్యాచరణను విస్తరించినట్లు ప్రకటించింది. సంస్థ సీఈఓ మాట్ జాన్సన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!