అయితే, రష్యా నుంచి వెనెజువెలాకు చమురు దిగుమతులను మళ్లించే అంశంలో భారత్ అనేక కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లభించే డిస్కౌంట్ పరిమాణం, రవాణా వ్యయం, సరఫరాకు పట్టే సమయం, బీమా వంటి ఖర్చులు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించనున్నాయి. భౌగోళికంగా వెనెజువెలా భారత్కు చాలా దూరంగా ఉండటంతో, అక్కడి నుంచి చమురు రవాణాకు పట్టే సమయం పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే సుమారు ఐదు రెట్లు ఎక్కువగా, రష్యాతో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రవాణా వ్యయం భారత్కు అదనపు భారం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే రష్యా నుంచి ప్రస్తుతం లభిస్తున్న డిస్కౌంట్ ధరలు కొనసాగకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ ఆసక్తి చూపడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!