

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రపంచం లోనే అత్యంత రద్దీగా కొనసాగుతోంది. ప్రతి నెల కనీసం 5 నుండి 10 కొత్త పరికరాలు లాంచ్ అవుతూ ఉంటాయి. డిసెంబర్ కూడా మినహాయింపు కాదు అసలు విషయానికి వస్తే, పలు బ్రాండ్లు తమ కొత్త ఫ్లాగ్షిప్ మోడళ్లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నందున, ఇది టెక్ అభిమానులకు అత్యంత ఉత్సాహభరితమైన నెలగా మారుతోంది.
డిసెంబర్ 2 న Vivo తన శక్తివంతమైన X300 సిరీస్‌ను పరిచయం చేయనుంది. ఈ సిరీస్ ధర ₹75,999 వరకు ఉండే అవకాశం ఉంది.అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న POCO F8, డిసెంబర్ రెండో వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.అలాగే, టెక్ ప్రేమికులు ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్న OnePlus 15R కూడా తన గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. దాదాపు ₹45,000 ధరతో, కంపెనీ డిసెంబర్ 17 ఉదయం ఈ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించబోతోంది.
ఇవే కాకుండా, OPPO Reno 15 సిరీస్, Redmi Note 15 Pro సిరీస్ కూడా డిసెంబర్ చివరి నాటికి మార్కెట్‌ను చేరతాయని అంచనా.ఇంతలో, Nothing Phone 3a Lite నవంబర్ 27 న లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, iQOO 15 ఈ రోజే అధికారికంగా లాంచ్ అవుతోంది.
మొత్తం మీద, డిసెంబర్ నెల భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు నిజంగా బ్లాక్‌బస్టర్ మంత్‌గా మారనుంది!



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!