
టెక్నాలజీ

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.75 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. 2020 నుంచి 2022 మధ్య తయారైన 16 మోడళ్లలో ఇంజిన్ స్టార్టర్ మోటార్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉత్పత్తి తనిఖీలు మరియు వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా ఈ సమస్య బయటపడినట్లు తెలిపింది.
స్టార్టర్ మెకానిజంలో ఉన్న మాగ్నెటిక్ స్విచ్లు అధిక వినియోగంతో అరిగిపోవడం వల్ల వాహనం స్టార్ట్ కావడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని బీఎండబ్ల్యూ పేర్కొంది. అరుదైన సందర్భాల్లో మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉండవచ్చని హెచ్చరించింది. ప్రభావిత వాహన యజమానులను సంప్రదించి అవసరమైన సవరణలు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!