

యూట్యూబ్ లేదా ఇతర వీడియో ప్లాట్‌ఫామ్‌లలో వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో ఆపాల్సి వస్తే, సాధారణంగా ఒక ట్యాప్‌తో పాజ్ చేసి, మళ్లీ మరోసారి ట్యాప్ చేసి ప్లే చేస్తాం. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఇప్పటివరకు ఈ విధానం అందుబాటులో లేకపోవడంతో, వీడియోను పాజ్ చేయాలంటే స్క్రీన్‌ను నొక్కి పట్టుకోవాల్సి వచ్చేది. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు అలవాటు అయిన వినియోగదారులకు ఇది కొంత అసౌకర్యంగా అనిపించేది. ఈ అంశాన్ని గుర్తించిన మెటా, ఇప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం “ట్యాప్-టు-పాజ్” ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీడియోను పాజ్ చేయడానికి ఇకపై స్క్రీన్‌ను హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇతర వీడియో ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే ఒక్క ట్యాప్‌తో రీల్‌ను సులభంగా ఆపవచ్చు. వీడియో పాజ్ చేసిన సమయంలో స్క్రీన్‌పై మ్యూట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది, దీని ద్వారా ఆడియోను కూడా నియంత్రించుకోవచ్చు.
ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు వీడియోలోని క్యాప్షన్లను సులభంగా చదవడం లేదా ప్రత్యేకమైన సన్నివేశాలను నిశితంగా గమనించడం మరింత సౌకర్యంగా మారుతుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు దశలవారీగా విడుదల చేస్తున్నారు.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!