
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తరచూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటోంది. అయితే వాట్సప్‌లో గోప్యత విషయంలో తాజాగా వివాదం మొదలైంది.
అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం, యూఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో, వాట్సప్ మాతృ సంస్థ అయిన మెటా, యూజర్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న సందేశాలను కూడా చదవగలదని వారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ఈ అంశంపై మెటా, వాట్సప్ సంస్థల స్పందన కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. గోప్యతపై నమ్మకం ఎంతవరకు నిలుస్తుందనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!