

జాక్ డోర్సీ స్థాపించిన బ్లాక్ సంస్థ బజ్ పేరుతో కొత్త వర్క్‌ప్లేస్ సహకార (Collaboration) ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది. ఉద్యోగులు, థర్డ్-పార్టీ AI ఏజెంట్లు ఒకే వేదికపై కలిసి పనిచేసేలా రూపొందించిన ఈ యాప్, స్లాక్ , గిట్‌హబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై సంస్థల ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఇందులో గ్రూప్ చాట్, థ్రెడ్స్, డైరెక్ట్ మెసేజింగ్, వాయిస్ కమ్యూనికేషన్, కోడ్ రిపోజిటరీలు, ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లోలు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
బజ్ ను ఓపెన్ సోర్స్, మోడల్ అగ్నోస్టిక్, డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌గా రూపొందించారు. దీంతో డెవలపర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను మార్చుకోవచ్చు, కొత్త సదుపాయాలను జోడించవచ్చు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉండగా, మ్యాక్‌ఓఎస్, విండోస్, లైనక్స్ కోసం ఉచిత డెస్క్‌టాప్ యాప్‌గా అందుబాటులో ఉంది. కార్యాలయాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బజ్ సంస్థలకు సమగ్ర AI సహకార వేదికగా మారాలని బ్లాక్ లక్ష్యంగా పెట్టుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!