

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు PSLV-C62 ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి ఆర్బిటల్ లాంచ్ కాగా, PSLV రాకెట్‌కు ఇది 64వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగం నేడు ఉదయం 10:17 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మిషన్ సుమారు రెండు గంటల పాటు కొనసాగనుంది.
ఈ ప్రయోగంలో రెండు స్ట్రాప్-ఆన్ బూస్టర్లతో ఉన్న PSLV-DL వేరియంట్ రాకెట్‌ను ఉపయోగిస్తున్నారు. మొత్తం మిషన్ బరువు సుమారు 260 టన్నులు. ప్రధాన పేలోడ్గా DRDO రూపొందించిన EOS-N1 (అన్వేషా) అనే ఆధునిక హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇది దేశ రక్షణ పర్యవేక్షణ, వ్యవసాయం, పట్టణ మ్యాపింగ్, పర్యావరణ పరిశీలనకు ఉపయోగపడుతుంది.
దీనితో పాటు భారత్‌తో పాటు బ్రెజిల్, నేపాల్, థాయ్‌లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, యుకే దేశాలకు చెందిన 15 చిన్న శాటిలైట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా స్పెయిన్‌కు చెందిన Kestrel Initial Demonstrator అనే శాటిలైట్ ద్వారా రీ-ఎంట్రీ టెక్నాలజీని పరీక్షించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!