

గూగుల్ తన సెర్చ్ ప్లాట్ఫామ్లో ఏఐ (AI) ఫీచర్లకు రెండు కొత్త అప్డేట్స్ను తీసుకొచ్చింది. ఈ అప్డేట్స్తో ఏఐ ఓవర్వ్యూస్ మరియు ఏఐ మోడ్ మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మారాయి. ఈ మార్పులు అన్ని డివైసులు మరియు ఇంటర్‌ఫేస్‌లలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నాయని గూగుల్ వెల్లడించింది.
ఈ అప్డేట్లో భాగంగా, జెమిని 3 ఏఐ మోడల్ ను ఇప్పుడు ఏఐ ఓవర్వ్యూస్ మరియు ఏఐ మోడ్ రెండింటికీ డిఫాల్ట్ మోడల్‌గా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు ఏఐ మోడ్ లో మాత్రమే
జెమిని 3 ఉండగా, ఏఐ ఓవర్వ్యూస్ పాత మోడల్‌తో పనిచేసేది. ఇకపై రెండు ఫీచర్లు ఒకే పెద్ద భాషా మోడల్‌పై నడవడం వల్ల, యూజర్లకు సమానమైన నాణ్యత గల సమాధానాలు లభించనున్నాయి.
ఇంకో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, సెర్చ్ ఫలితాల పేజీ నుంచి ఏఐ మోడ్ కు మారడం ఇప్పుడు మరింత సులభమైంది. ఇంతకు ముందు ఏఐ ఓవర్వ్యూస్ లో “షో మోర్” పై క్లిక్ చేసిన తర్వాత మరో స్టెప్ అవసరం ఉండేది. ఇప్పుడు ఆ బటన్ నొక్కగానే కింద కొత్త టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయి, యూజర్లు తమ ఫాలో-అప్ ప్రశ్నను నేరుగా టైప్ చేయవచ్చు.
ఈ మార్పుతో, మళ్లీ మొదటి ప్రశ్నకు సమాధానం చూడాల్సిన అవసరం లేకుండా, యూజర్లు నేరుగా తమ తదుపరి ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం గ్లోబల్‌గా రోల్ఔట్ అవుతున్నాయి. అయితే, అన్ని యూజర్లకు కనిపించడానికి కొన్ని రోజులు పట్టవచ్చని గూగుల్ తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!