

గూగుల్ డాక్స్ కోసం ‘ఆడియో సమ్మరీస్’ అనే కొత్త కృత్రిమ మేధస్సు ఫీచర్‌ను గూగుల్ విడుదల చేసింది. జెమినీ ఆధారంగా పనిచేసే ఈ సదుపాయం ద్వారా పెద్ద పెద్ద డాక్యుమెంట్లను పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా, వాటి ముఖ్యాంశాలను ఆడియో రూపంలో వినొచ్చు. సాధారణంగా ఉండే టెక్స్ట్ చదివే ఫీచర్లతో పోలిస్తే, ఇది సహజంగా మాట్లాడినట్లుగా సారాంశాన్ని వినిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ట్యాబ్‌లలో ఉన్న విషయాలను కూడా కొద్దిసేపులో సంక్షిప్తంగా చెబుతుంది.
ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అప్డేట్లో భాగంగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది చెల్లింపు ప్లాన్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. బిజినెస్, ఎంటర్ప్రైజ్, గూగుల్ AI ప్రో, అల్ట్రా వంటి ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. వినియోగదారులు నరేటర్, కోచ్ వంటి వాయిస్‌లను ఎంచుకోవచ్చు. అలాగే ప్లేబ్యాక్ స్పీడ్ మార్చుకోవడం, ముందుకు లేదా వెనక్కి వెళ్లే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ సారాంశం పూర్తిగా డాక్యుమెంట్లో ఉన్న సమాచారంపైనే ఆధారపడి ఉంటుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!