

కృత్రిమ మేధ (ఏఐ) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనల మధ్య, ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ విడుదల చేసిన ఒక నివేదిక కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏఐ కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఆ నివేదిక చెబుతోంది. అయితే టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే రంగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు కొంత నెమ్మదించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఏఐ సామర్థ్యం ఎంతో పెద్దదైనా, ప్రస్తుతం దాని వినియోగం మాత్రం ఇంకా పరిమితంగానే ఉందని నివేదిక తెలిపింది.
కోడింగ్, సమాచార ప్రాసెసింగ్, డేటా విశ్లేషణ వంటి డిజిటల్ పనుల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉండే అవకాశముందని నివేదిక తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్ మరియు ఇన్వెస్ట్మెంట్ అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే వంటవాళ్లు, మోటార్‌సైకిల్ మెకానిక్‌లు, లైఫ్‌గార్డ్‌లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్లు వంటి చేతి పనులు ఎక్కువగా ఉండే ఉద్యోగాలకు పెద్దగా ముప్పు ఉండదని నివేదిక వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!