
సినిమాలు

ఏఐ ఆధారిత అధునాతన టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆంథ్రోపిక్ సంస్థ తమ క్లాడ్ కోవర్క్ ప్లాట్‌ఫామ్ అనేక సాఫ్ట్వేర్ పనులను స్వతంత్రంగా చేయగలదని ప్రకటించడం ఈ చర్చను మరింత పెంచింది. 2030 నాటికి ప్రారంభస్థాయి ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు రావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే గూగుల్, ఎన్విడియా వంటి టెక్నాలజీ దిగ్గజాలు ఏఐ సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయం కాదని, దాని సామర్థ్యాన్ని పెంచే సాధనమని స్పష్టం చేస్తున్నాయి. ఏఐ వల్ల నిపుణుల ఉత్పాదకత పెరిగి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కమ్యూనికేషన్, సృజనాత్మకత వంటి నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!