

2028 మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ అమలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించే అంశాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణ సౌలభ్యం, ఖర్చులు, లాజిస్టిక్స్ పరంగా యూఏఈ అనుకూల వేదికగా భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా గ్రూప్ దశలోని ఇతర మ్యాచ్‌లు, నాకౌట్ పోటీలను పాకిస్థాన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఫైనల్‌కు భారత్ అర్హత సాధించకపోతే లాహోర్‌లోనే తుది పోరు నిర్వహించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వేదికలపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించగా, 2023 ఆసియా కప్‌లో భారత జట్టు శ్రీలంకలో ఆడింది. 2028 మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ హైబ్రిడ్ మోడల్ అమలైతే, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి దృష్టి పడనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!