
ఆరోగ్యం

ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయకపోయినా, అగ్రశ్రేణి బౌలర్లపై అతడు చూపించిన దూకుడు అభిమానులు, మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అతడిని వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. సూర్యవంశీకి త్వరలోనే భారత జట్టులో అవకాశం లభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యున్నత స్థాయిలో రాణించే సామర్థ్యం ఈ యువ బ్యాటర్లో ఉందని గవాస్కర్ పేర్కొన్నారు. అయితే అతడి ఎంపికపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!