

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ఉండటంతో శనివారం రాత్రి జరగనున్న ఐదో మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ నిర్ణయాత్మక పోరుకు ముందు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఆసక్తికర పోస్టు చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడికి తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం లభించలేదు. బెంచ్‌కే పరిమితమైన వైభవ్.. ‘ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నా’ అనే సందేశంతో పోస్టు పెట్టడంతో ఆఖరి మ్యాచ్‌లోనైనా అతడికి అవకాశం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది.
మరోవైపు, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు యాజమాన్యం ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు జట్టు సమతూకం, ఆటగాళ్ల ప్రదర్శన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ గతంలో వివరించాడు. వైభవ్‌ను ఆడించాలంటే సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలో ఒకరిని తప్పించాల్సి ఉంటుందని, ప్రస్తుతం కొనసాగుతున్న కాంబినేషన్‌ను మార్చడంపై ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కీలకమైన ఐదో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కుతుందా? లేక మరోసారి బెంచ్‌కే పరిమితం అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!