

న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి టీ20లో రికార్డు విజయాన్ని అందుకుని జోరుమీదున్న భారత జట్టుకు రెండో మ్యాచ్‌కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గజ్జల్లో నొప్పితో బాధపడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో టీ20కి దూరం కానున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ గాయంతో ఇబ్బంది పడటంతో తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించామని తెలిపారు. ఇషాన్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇషాన్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు.
వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆసక్తి నెలకొంది. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉండగా, వైభవ్ కూడా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. ఇషాన్ సాధారణంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ బ్యాటింగ్ స్థానాలను ఎలా సర్దుబాటు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సంజు శాంసన్ వన్‌డౌన్‌లో ఆడిన అనుభవం ఉండటంతో, తుది కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. రెండో టీ20కి ముందు ఇషాన్ అందుబాటుపై వైద్య బృందం నివేదిక కీలకం కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!