

2027 జనవరి వరకు టీమ్ ఇండియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాలంలో భారత్ జట్టు అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లతో టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. రాబోయే నెలల్లో టీమ్ ఇండియాకు బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ ఉండనుంది.
ఇదిలా ఉండగా, ఏషియన్ గేమ్స్ టోర్నమెంట్లో కూడా భారత్ పాల్గొననుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ అభిమానుల్లో భారీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ షెడ్యూల్లో అనేక హై వోల్టేజ్ మ్యాచ్‌లు ఉండటంతో క్రికెట్ అభిమానులకు ఇది పెద్ద పండుగలా మారనుంది.
టీమ్ ఇండియా షెడ్యూల్ (2027 జనవరి వరకు):
అఫ్గానిస్తాన్‌తో 1 టెస్ట్, 3 వన్డేలు
ఐర్లాండ్‌తో 3 టీ20లు
ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
శ్రీలంకతో 2 టెస్టులు, 3 టీ20లు
బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి మేరకు)
అఫ్గానిస్తాన్‌తో 3 టీ20లు
జింబాబ్వేతో 3 టీ20లు
వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
ఏషియన్ గేమ్స్
న్యూజిలాండ్‌తో 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు
శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు
ఆస్ట్రేలియాతో 5 టెస్టులు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!