
జనరల్

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో సంబంధాలను తగ్గించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన తన ఇన్స్టాగ్రామ్ బయోలో నుంచి ‘Mumbai Indians’ మరియు ‘Mumbai’ పేర్లను తొలగించడంతో పాటు, MIకి సంబంధించిన పోస్టులు, వీడియోలను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పరస్పరం ఫాలో అన్‌ఫాలో చేయడం కూడా చర్చకు దారితీసింది.
ఇటీవల హార్దిక్ పాండ్యా తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్‌ను విడిచే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే సీజన్లో ఇద్దరూ జట్టులో కొనసాగుతారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈ పరిణామాలు క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!