
గాసిప్స్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు ఒమాన్‌పై 105 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో ఒమాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బౌలింగ్ విభాగంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను అదుపులో ఉంచి జట్టుకు భారీ విజయాన్ని అందించారు. ఈ విజయంతో టోర్నీలో శ్రీలంక తన స్థితిని మరింత బలపరుచుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!