

భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరోసారి ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని సాధించింది. ఈ రోజు ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఒక స్థానం ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది. 790 రేటింగ్ పాయింట్లతో ఆమె దక్షిణాఫ్రికా ఆటగాళి లారా వొల్వార్డ్ (782 పాయింట్లు)ను వెనక్కి నెట్టింది. ఇది ఆమె స్థిరమైన ప్రదర్శనకు మంచి నిదర్శనం.

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 9 వ స్థానానికి చేరుకుంది. మరో బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ 12 వ స్థానంలో ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మాత్రం 10 స్థానాలు కోల్పోయి 29 వ ర్యాంక్‌కు పడిపోయింది. బౌలింగ్ విభాగంలో కూడా ఆమె 5 స్థానాలు కోల్పోయి 10 వ స్థానంలో నిలిచింది. తెలుగమ్మాయి స్పిన్నర్ శ్రీచరణి మూడు స్థానాలు కోల్పోయి 26 వ స్థానానికి చేరుకుంది. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ అలానా కింగ్ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.






.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!