
గాసిప్స్
.jpg&w=3840&q=75)
డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా భారత స్టార్ డిస్కస్ త్రో అథ్లెట్ సీమా పునియా పై 16 నెలల నిషేధాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించింది. ఈ నిషేధం నవంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు నాడా వెల్లడించింది. అయితే, ఆమె శరీరంలో ఏ నిషేధిత ఉత్ర్పేరకం గుర్తించబడిందో వివరాలు మాత్రం వెల్లడించలేదు.
42 ఏళ్ల సీమా పునియాకు ఇది రెండోసారి డోపింగ్ నిషేధం కావడం గమనార్హం. జూనియర్ స్థాయిలో కూడా డోపింగ్ పరీక్షలో విఫలమై ఒకసారి నిషేధాన్ని ఎదుర్కొంది. పునియా చివరిసారిగా 2023 ఆసియా గేమ్స్‌లో పాల్గొంది. ఆ పోటీల్లో ఆమె రజత పతకం సాధించింది. నాలుగు మార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలుపొందిన సీమా పునియా, భారత అథ్లెటిక్స్‌లో అత్యంత అనుభవజ్ఞ అథ్లెట్లలో ఒకరు.
ఈ తాజా నిషేధంతో ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయినట్టే అని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!