
బిజినెస్

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వీడ్కోలుపై పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే 2016లో మెస్సీ తొలిసారి అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో రొనాల్డో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి. మెస్సీ కఠిన నిర్ణయం తీసుకున్నాడని, ఓటములు, రెండో స్థానంలో నిలవడం అతడికి ఇష్టం ఉండదని రొనాల్డో అప్పట్లో పేర్కొన్నాడు.
మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే ఎంతో బాధగా ఉందని రొనాల్డో అన్నాడు. మెస్సీ మళ్లీ జాతీయ జట్టులోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు కూడా తెలిపాడు. తాజాగా మెస్సీ రిటైర్మెంట్ అంశం చర్చనీయాంశంగా మారడంతో రొనాల్డో నాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!