

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద కాటేథాంగ్‌పై 21–14, 8–21, 23–21తో ఉత్కంఠభరిత విజయం సాధించింది. తొలి గేమ్‌ను గెలిచిన సింధు రెండో గేమ్‌లో తడబడి ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. దీంతో డెన్మార్క్ ఓపెన్‌లో ఎదురైన తొలి రౌండ్ నిష్క్రమణ పునరావృతమవుతుందేమోనని అనిపించింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పట్టుదలగా ఆడిన సింధు కీలక పాయింట్లను సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో భారత షట్లర్ ఉన్నతి హుడా 18–21, 21–12, 17–21తో జపాన్‌కు చెందిన రికో గుంజి చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు ఆయుష్ శెట్టి 19–21, 21–16, 21–12తో సహచర ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు, లక్ష్య సేన్ తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!