

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవర్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి దేశానికే గర్వకారణమైంది.
49 ఏళ్ల ప్రగతి టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఫొటోలు వీడియోలు షేర్ చేశారు, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఓవరాల్ – సిల్వర్ మెడల్ , డెడ్‌లిఫ్ట్ – గోల్డ్ మెడల్, బెంచ్ ప్రెస్ అండ్ స్క్వాట్ – రెండు సిల్వర్ మెడల్స్.
ఏపీ నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ప్రగతి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టారు. తమిళ దర్శకుడు కె. భాగ్యరాజ్ ‘వీట్ల విశేషంగా’ చిత్రంలో హీరోయిన్గా నటించారు. తర్వాత తమిళం మలయాళంలో నటించి తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భార్య తల్లి సోదరిగా అనేక చిత్రాల్లో మనసు దోచుకున్నారు.
నటనతో పాటు ఫిట్‌నెస్‌కు ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చిన ప్రగతి సినిమా బ్రేక్ సమయంలో జిమ్ కసరత్తు మొదలుపెట్టారు. క్రమంగా పవర్‌లిఫ్టింగ్ వైపు అడుగుపెట్టి 2023 నుంచి పోటీల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఏపీ రాష్ట్ర స్థాయి కేరళలో జరిగిన నేషనల్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.
ఇప్పుడు టర్కీలో అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలతో మెరిసి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు. అభిమానులు సెలబ్రిటీలు సైతం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!