
న్యూస్

ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ సంచలనం సృష్టిస్తున్నాడు. యూఏఈపై 32 బంతుల్లో శతకం, పాకిస్తాన్ U19పై 28 బంతుల్లో 45 పరుగులు చేసి మొత్తం రెండు మ్యాచ్‌ల్లో 189 పరుగులు సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఇంత దూకుడుతో సిక్సర్లు కొడుతుండటంపై ఒమన్ యువ ఆటగాళ్లు ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాస్తవ తన్మయత వ్యక్తం చేశారు.
“14 ఏళ్ల వాడి నుంచి ఇలాంటి సిక్సర్లు రావడం నమ్మశక్యం కాదు” అని ఆర్యన్ అన్నాడు. సమయ్ కూడా అతని మైండ్‌సెట్ తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. చిన్న వయసులోనే ఇంత ప్రభావవంతమైన బ్యాటింగ్ చేయడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. 35 బంతుల్లో రెండు టీ20 శతకాలు చేసిన తొలి ఆటగాడిగా సూర్యవంసి కొత్త రికార్డు సృష్టించి, భారత క్రికెట్లో భవిష్యత్ స్టార్‌గా నిలుస్తున్నాడు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!