
.webp&w=3840&q=75)
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి 71 పరుగులు ఇచ్చి, 6 వికెట్లు తీసి చెలరేగాడు. టెస్ట్ క్రికెట్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆరేసి వికెట్లు తీసిన తొలి ఆసీస్ పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అంతేకాదు, పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్ టెస్ట్ క్రికెట్లో 414 వికెట్లు తీస్తే, మిచెల్ స్టార్క్ 415 వికెట్లు సాధించి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఎడమచేతి పేసర్‌గా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. స్టార్క్ ప్రస్తుతం ఆల్‌టైమ్ వికెట్ టేకర్ల జాబితాలో 16వ స్థానంలో ఉన్నాడు.
నవంబర్‌లో పెర్త్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో 58 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
గతంలో వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో 6 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా టామ్ రిచర్డ్సన్ రికార్డు సృష్టించాడు. 1895లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులకు 6 వికెట్లు తీశాడు. లార్డ్స్, మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లలోనూ తొలి ఇన్నింగ్స్‌లో 6, 7 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.







.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!