

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న సేన్, వరల్డ్ నెంబర్ 6 చౌ టెయిన్ చెన్ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్ మూడు సెట్లపాటు ఉత్కంఠ రేపింది. మొదటి గేమ్‌ను 17–21తో కోల్పోయిన సేన్, రెండో గేమ్‌లో స్కోరు ఎన్నిసార్లు మారినా చివర్లో ధైర్యంగా ఆడి 24–22తో తన వైపు తిప్పుకున్నాడు.
స్కోరు 1–1తో సమమైన తర్వాత మూడో గేమ్‌లో సేన్ దూకుడు మరింత పెంచాడు. ప్రారంభం నుంచే ఆధిక్యాన్ని పట్టుకుని 21–16తో మ్యాచ్‌ను ముగించాడు. మొత్తం 86 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో సేన్ తన ఫైటింగ్ స్పిరిట్‌ను మరోసారి చూపించాడు.
ఇప్పుడు అతని ముందున్నది టైటిల్ ఛాలెంజ్. ఆదివారం జరిగే ఫైనల్లో సేన్, జపాన్ ఆటగాడు యూషి టనాకాను ఎదుర్కోనున్నారు. ఈ సంవత్సరం సేన్ ఫైనల్‌కు చేరింది ఇదే రెండోసారి. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను, ఈసారి మాత్రం టైటిల్ కోసం పోరాడబోతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతని టైటిల్ కల నిజమవుతుందా అన్నది అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!