
జనరల్

ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే 2026 ఫిఫా ప్రపంచకప్‌లో 10 గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే ప్రపంచకప్ టోర్నీలో రెండంకెల గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచిన ఎంబాప్పే, 1954లో 11 గోల్స్ చేసిన శాండోర్ కొక్సిస్, 1958లో 13 గోల్స్ సాధించిన జస్ట్ ఫాంటైన్, 1970లో 10 గోల్స్ చేసిన గెర్డ్ ముల్లర్ సరసన చోటు దక్కించుకున్నాడు. 56 ఏళ్ల తర్వాత ఈ ఘనతను అందుకున్న తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ టోర్నీలో ఎంబాప్పే ప్రదర్శించిన అద్భుత ఆటతీరు అతడిని ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో స్థాయికి తీసుకెళ్లింది. వరుసగా గోల్స్ చేస్తూ ఫ్రాన్స్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచిన అతడు గోల్డెన్ బూట్ రేసులోనూ ఆధిక్యం కొనసాగించాడు. ప్రపంచకప్ వేదికపై వరుస రికార్డులు బద్దలు కొడుతూ, ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!