
సినిమాలు

ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలాన్ని డిసెంబర్ 16న గోవాలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పది ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచారం అందించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. వేలానికి ముందు డిసెంబర్ 15న ఫ్రాంచైజీలకు బ్రీఫింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
మూడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ వేలం భారత్లో జరగనుండటం విశేషం. గతంలో 2024లో దుబాయ్, 2025లో జెడ్డా, 2026లో అబుధాబిలో వేలం నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, వేలం తేదీ, వేదికకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!