

వచ్చే సీజన్‌కు సంబంధించిన IPL 2026 వేలం డిసెంబర్ 16 న అబుదాబిలో జరగనుండగా, ఆటగాళ్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 1,390 మంది క్రికెటర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల అభ్యర్థనల మేరకు 350 మందిని మాత్రమే చివరి జాబితాలో చేర్చారు. వీరిలో భారత ఆటగాళ్లు 240 మంది ఉన్నారు.
ఈసారి వేలంలో కేవలం 77 ఖాళీలు మాత్రమే ఉండటంతో, పోటీ ఎప్పటికన్నా కఠినంగా ఉండనుంది. తాజాగా, దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ కూడా తన పేరు జాబితాలో చేర్చుకున్నాడు. అతని బేస్ ప్రైస్ ₹1 కోటి. అలాగే, చివరిసారి 2021 లో IPL ఆడిన ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కూడా ఈసారి వేలంలో కనిపించనున్నాడు. అతని బేస్ ప్రైస్ ₹2 కోట్లుగా నిర్ణయించారు.
ఈసారి జట్లు 46 మంది భారతీయులను, 31 మంది విదేశీయులను మాత్రమే ఎంచుకోవాలి. భారత ప్లేయర్లలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ పేర్లపై ప్రత్యేక దృష్టి ఉండే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యంత హాట్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. అదేవిధంగా రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, జేక్ ఫ్రేజర్, హసరంగ వంటి ఆటగాళ్లకు కూడా భారీ డిమాండ్ ఉండొచ్చు.
ఈ తుది జాబితా విడుదలతో IPL 2026 వేలంపై ఉత్సాహం మరింతగా పెరిగింది. డిసెంబర్ 16 న జరిగే వేలంలో పెద్ద ఎత్తున బిడ్డింగ్ వార్స్ జరిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!