

ఆసియా పారా గేమ్స్‌లో భారత్ నాలుగో రోజూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు స్వర్ణ పతకాలను సాధించిన భారత్.. మొత్తం 71 పతకాలతో పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 16 స్వర్ణాలు, 22 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన శీతల్ దేవి.. మిక్స్‌డ్ డబుల్స్‌లో తోమన్ కుమార్‌తో కలిసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో భారత జోడీ 151–148 తేడాతో ఇండోనేషియాను ఓడించింది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో భారత అథ్లెట్ సువర్ణ రాజ్ 15.66 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆసియా పారా గేమ్స్‌లో పోటీపడిన తొలి భారత డబ్ల్యూ1 ఆర్చర్‌గా స్వాతి చౌదరి చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. చివరకు 4–6 తేడాతో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్‌లోనూ భారత అథ్లెట్లు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో సంజనా కుమారి కాంస్యం గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో అభిజీత్, సుహాస్ యతిరాజ్ కాంస్య పతకాలు సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో కృష్ణ నాగర్–నిత్య శ్రీ జోడీ, ఎస్‌ఎల్3 విభాగంలో మనీషా రామ్‌దాస్–ప్రమోద్ భగత్ జోడీ కూడా కాంస్య పతకాలను దక్కించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!