

ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జంట హర్మీత్ దేశాయ్, యశస్విని గోర్పాడే అద్భుత ప్రదర్శనతో పతకాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గాంగ్‌యాన్, లీ డేయున్ జోడీపై 3-2తో విజయం సాధించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత జంట 11-6, 8-11, 8-11, 11-9, 11-9తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. కీలకమైన చివరి రెండు గేముల్లో రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయంతో ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు 72 ఏళ్ల తర్వాత పతకం ఖాయమైంది. 1954లో యతిన్ వ్యాస్, మీనా పరాడే జంట భారత్‌కు చివరిసారిగా ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించింది. ఇన్నేళ్ల తర్వాత హర్మీత్ దేశాయ్, యశస్విని గోర్పాడే జోడీ భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. తదుపరి సెమీఫైనల్లో ఈ భారత జంట జపాన్‌కు చెందిన మివా హారిమోటో, సోరా మాత్సుషిమాతో తలపడనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!