
సినిమాలు

భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనకు ఎప్పుడూ సవాళ్లు అంటేనే ఇష్టమని తెలిపాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని విజయాన్ని సాధించడం తనకు పెద్ద ప్రేరణగా ఉంటుందని, అందుకే క్రికెట్లోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. సవాళ్లను స్వీకరించడం ద్వారా తన ఆటను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని బుమ్రా చెప్పారు.
తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసిన వీడియోలో బుమ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న పనిలో మార్పు తీసుకురావడం, జట్టుకు ఉపయోగపడే విధంగా ప్రదర్శన ఇవ్వడం తనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. అలాంటి సంతోషం క్రీడాకారుడికి అత్యంత గొప్ప అనుభూతి అని బుమ్రా పేర్కొన్నారు.


















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!