

టీ20 ప్రపంచ కప్ 2026 లో ఆస్ట్రేలియా జట్టు విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు నమోదు చేసింది. మార్కస్ స్టాయినిస్ 45 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి 17 బంతుల్లో 37 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచారు. రెన్ షా కూడా 37 పరుగులతో సహకరించారు. కామెరూన్ గ్రీన్ 21 పరుగులతో చురుకైన ఆట చూపినా ఎక్కువసేపు నిలవలేదు. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. చివర్లో కూపర్ కొన్నోలీ, బార్ట్లెట్ తలా 11 పరుగులతో ఇన్నింగ్స్ ముగించారు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని ఎదుర్కోలేకపోయింది. 16.5 ఓవర్లలోనే 115 పరుగులకు ఆలౌటైంది. జార్జ్ డాక్రెల్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. లోర్కాన్ టక్కర్ 24 పరుగులు చేశారు. రాస్ అడైర్, మార్క్ అడైర్ తలా 12 పరుగులు జోడించారు.
బౌలింగ్‌లో ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలా నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పేశారు. కునెమన్ ఒక వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో శుభారంభం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!