
రాజకీయాలు

భారత జూనియర్ హాకీ జట్టుకు ఫ్రాన్స్‌కు చెందిన మాజీ హాకీ స్టార్ ఫ్రెడెరిక్ సోయెజ్ను కొత్త కోచ్‌గా నియమించినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. శ్రీజేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 48 ఏళ్ల ఫ్రెడెరిక్ 1995 నుంచి 2010 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 196 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. తన 15 ఏళ్ల కెరీర్లో మొత్తం 195 గోల్స్ సాధించి గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందారు.
ఆటగాడిగా రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా కూడా ఫ్రెడెరిక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్ పురుషుల జాతీయ జట్లకు కోచ్‌గా సేవలందించారు. భారత జూనియర్ జట్టుకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే అభిప్రాయపడ్డారు. హాకీ ఇండియా కుటుంబంలోకి ఫ్రెడెరిక్ సోయెజ్ను సాదరంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!